Adipurush: విజివల్ వండర్‌గా రానున్న 'ఆదిపురుష్'

Adipurush: 'తన్హాజీ' ఫేమ్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో యువ రెబెల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రం 'ఆదిపురుష్'.

Venkata Chari
Updated on: 30 April 2021 6:00 AM IST
Om Raut to use Tanhaji techniques for Adipurush?
X

ఆది పురుష్ లో ప్రభాస్

Adipurush: 'తన్హాజీ' ఫేమ్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో యువ రెబెల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటాయి. హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్న సంగతి తెలిసిందే.

షూటింగ్‌లో కొంత భాగం ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. తాజా నివేదికల ప్రకారం, డైరెక్టర్ తన మునుపటి సినిమా అజయ్ దేవ్‌గన్ నటించిన 'తన్హాజీ: ది అన్సంగ్ వారియర్' కోసం వాడిన టెక్నిక్స్‌ను 'ఆదిపురుష్' సినిమా కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంద.

అలాగే, అధిక బడ్జెట్ సినిమాగా రూపొంతున్న 'ఆదిపురుష్'... 'తన్హాజీ' కన్నా మంచి అనుభూతిని ఇవ్వబోతోందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా 'ఆదిపురుష్' అద్భుతమైన అవుట్ పుట్ ఇవ్వబోతోందని సీని వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే కృతి సనోన్ ఈ చిత్రంలో సీత పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషలలో ఒకేసారి చిత్రీకరించబడుతోంది.

Venkata Chari

Venkata Chari

Next Story