OG: OG రిలీజ్ డేట్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?

OG: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో పవన్ ఫ్యాన్స్ తో పాటు అందర్ని అట్రాక్ట్ చేస్తున్న సినిమా OG.

Jyothi
Published on: 23 May 2023 10:55 AM IST
OG Release Date Fixed When is the Release?
X

OG: OG రిలీజ్ డేట్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?

OG: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో పవన్ ఫ్యాన్స్ తో పాటు అందర్ని అట్రాక్ట్ చేస్తున్న సినిమా OG. ప్రభాస్ తో సాహో సినిమా తీసిన సుజిత్ దర్శకత్వంలో OG తెరకెక్కుతుండగా డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

OG చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసిన పవన్ ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ పనులపై ఫోకస్ చేశారు. తొలి షెడ్యూల్ ముంబైలో జరుగగా...కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు హీరోహీరోయిన్ పాల్గొనే సన్నివేశాలను సుజిత్ తెరకెక్కించారు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ మహాబలేశ్వరంలో జరుపుకుంటోంది. ఇక, అసలు విషయానికొస్తే OG మూవీని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ దిశగానే షూటింగ్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారట..

OG చిత్రాన్ని ఈ ఏడాది వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని సుజిత్ తన సన్నిహితుల వద్ద చెప్పారట. సుజిత్ చెప్పినట్లే..వరుస షెడ్యూల్స్ తో OG షూటింగ్ ని పరుగులు పెట్టించేస్తున్నారు. డిసెంబర్ డెడ్ లైన్ కు అనుగుణంగా షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారట..మొత్తానికి, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో పవన్ చేసిన బ్రో మూవీ జూలై 28న విడుదలౌతోంది. హరీష్ కాంబోలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదే ఊపులో పవర్ హరిహరవీరమల్లు చిత్రానికి కూడా డేట్స్ కేటాయించి సినిమాని పూర్తి చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Jyothi

Jyothi

Next Story