Breaking News: అవును మేము విడిపోతున్నాం.. ప్ర‌క‌టించిన నాగ చైత‌న్య‌, స‌మంత‌

Breaking News: సమంత, నాగచైతన్య విడాకుల ఉత్కంఠకు తెరపడింది.

Arun Chilukuri
Updated on: 2 Oct 2021 5:38 PM IST
Official Announcement from Naga Chaitanya Divorce With His Wife Samantha in Social Media
X

Breaking News: సమంత- నాగ చైతన్య విడాకులు!

Breaking News: గత కొన్ని నెలలుగా శామ్, చైతన్యలు విడిపోనున్నారనే వార్తలకు చెక్ పడింది. పదేళ్ల స్నేహానికి ముగింపు పలికినట్లు అక్కినేని నాగచైతన్య-సమంత ట్వీట్ చేశారు. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని ఎవరి దారి వారు చూసుకోవాలకున్నాం అంటూ నాగచైతన్య ట్వీట్ చేశారు. మరోవైపు చై ట్వీట్ చేసిన కాసేపటికే సమంతా సైతం ఇన్ స్టా వేదికగా విడాకుల అంశాన్ని ప్రస్తావించింది. 2017లో పెళ్లి చేసుకున్న చైతన్య-శామ్ అంతకుముందు పదేళ్ల పాటు స్నేహంగా ఉండి ఒక్కటయినట్లు తెలిపారు. అభిమానులంతా అర్థం చేసుకోవాలని నాగచైతన్య కోరారు.

గత కొన్ని నెలలుగా శామ్-చైతన్య విడిపోనున్నారని వార్తలు చక్కర్లు కొట్టినా ఈ ఇద్దరు స్పందించలేదు. వివాహం అనంతరం తిరిగి సినిమాలు ప్రారంభించిన శామ్ మజిలీ, ఓ బేబీ లాంటి సాఫ్ట్ మూవీలతో పాటు కొన్ని బోల్డ్ కేరెక్టర్‌లు చేయడం హాట్‌టాపిక్ అయింది. అయితే, సమంతాను చైతన్య సపోర్ట్ చేస్తున్నారనే అంతా అనుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీమెన్‌ సిరీస్‌లో శామ్ చేసిన బోల్డ్ క్యారెక్టర్ వివాదాస్పదం కావడంతో హాట్‌టాపిక్ అయింది. ఇటు చైతన్య లవ్‌స్టోరీ షూటింగ్ మొదలైన నాటి నుంచి ఈ విడాకుల వార్తలు మరింత ఎక్కువయ్యాయి. ఇలాంటి సమయంలో అటు సమంత ఇటు చైతన్య ఇద్దరూ స్పందించలేదు. దీంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయింది. అయితే, లవ్ స్టోరీ ట్రైలర్ విడుదల సందర్భంగా చైతన్యను అభినందిస్తూ శామ్ చేసిన ట్వీట్ ఈ మొత్తం వ్యవహారానికి చెక్ పెట్టినట్లే అని అందరూ భావించారు. ఇలాంటి పరిస్థితుల్లో చైతన్య-సమంతా విడాకులపై స్పష్టతనివ్వడం ఫ్యాన్స్‌కు షాకిచ్చింది.

సమంతా-చైతన్య విడాకుల నిర్ణయం అభిమానులకు షాకిచ్చింది. ఈ జంట విడాకుల అంశంపై ఇప్పటి వరకూ చక్కర్లు కొట్టిన వార్తలను మొదట్లో అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే, సమంత ట్విట్టర్ హ్యాండిల్‌లో అక్కినేని పేరును తొలగించినప్పటి నుంచీ అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. దీనికితోడు విడాకుల వార్తలను ఖండించకపోవడం లాంటి అంశాలు సోషల్ మీడియా వేదికగా వైరల్‌ అవ్వడానికి కారణమైంది. ఏది ఏమైనా తమ అభిమాన జంట విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story