ఆఫీషియల్ : సుకుమార్ తో విజయ్ దేవరకొండ !

Sukumar With Vijay Devarakonda : యంగ్ సెన్సేషన్ విజయ్‌ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఆఫీషియల్ ప్రకటన వెలువడింది..

Krishna
Published on: 28 Sept 2020 1:05 PM IST
ఆఫీషియల్ : సుకుమార్ తో విజయ్ దేవరకొండ !
X

Sukumar With Vijay Deverakonda

Sukumar With Vijay Devarakonda : యంగ్ సెన్సేషన్ విజయ్‌ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఆఫీషియల్ ప్రకటన వెలువడింది.. ఈ సినిమాని ఫాల్కన్ క్రియేష‌న్స్ ప‌తాకంపై కేదార్ సెల‌గంశెట్టి నిర్మిస్తున్నారు. ఈయనకి నిర్మాతగా ఇదే మొదటి సినిమా కావడం విశేషం.. ఈ రోజు అయన పుట్టిన రోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన ప్రకటనను మేకర్స్ రిలీజ్ చేశారు. 2022లో సినిమాను విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు,

దీనిపైన విజయ్ దేవరకొండ స్పందిస్తూ... ''నాలో ఉన్న నటుడు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాడు. నాలోని ప్రేక్షకుడు సంబరాలు చేసుకుంటున్నాడు. ఇదొక గుర్తుండిపోయే సినిమా అవుతుందని హామీ ఇస్తున్నా.. సుక్కు సర్‌.. మీతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నా''అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా తన మిత్రుడు కేదార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా అని అనౌన్స్ రాగానే సినిమా పైన మంచి క్రేజ్ ఏర్పడింది.


ఇక ప్రస్తుతం విజయ్‌దేవర కొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫైటర్‌' సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ భామా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. అటు సుకుమార్ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తో పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

Krishna

Krishna

Next Story