మంచి ఆఫర్ ని చేజిక్కించుకున్న రంగమార్తాండ

Offer from OTT to Krishna Vamsi | Tollywood News
x

మంచి ఆఫర్ ని చేజిక్కించుకున్న రంగమార్తాండ

Highlights

*మంచి ఆఫర్ ని చేజిక్కించుకున్న రంగమార్తాండ

Ranga Maarthaanda: ఇండస్ట్రీలో పేరుమోసిన డైరెక్టర్లలో కృష్ణవంశీ కూడా ఒకరు. ఒకప్పుడు వరుస బ్లాక్బస్టర్ సినిమాలతో ముందుకు దూసుకుపోయిన కృష్ణవంశీ ఆ తరువాత వరుస డిజాస్టర్ లతో సతమతమయ్యారు. తాజాగా ఇప్పుడు "రంగమార్తాండ" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "నటసామ్రాట్" అనే ఒక సూపర్ హిట్ సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది.

ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదల చేయడానికి కృష్ణవంశీ ఒప్పుకుంటారా లేదా అని చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఒక ఓటు ప్లాట్ఫామ్ నుంచి ఈ సినిమాకి 20 కోట్ల ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో సినిమాలు థియేటర్లలో హిట్ అవ్వడం అంత చిన్న విషయం కాదు. కరోనా తర్వాత థియేటర్లలో విడుదలైన కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర దర్శక నిర్మాతలు ఓటీటీ డీల్ ను ఒప్పుకొని ఈ సినిమాని డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories