ఎన్టీఆర్‌, రాంచరణ్‌కు అక్టోబర్‌ భయం.. దర్శకధీరుడిపైనే నమ్మకం

*అక్టోబర్‌లో రిలీజై ప్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న ఇద్దరి సినిమాలు *అక్టోబర్‌లో రిలీజ్‌ కానున్న ఆర్‌ఆర్‌ఆర్‌ *ఇద్దరి హీరోల ఫ్యాన్స్‌లో అక్టోబర్‌ టెన్షన్‌ *దర్శకధీరుడిపైనే అభిమానుల నమ్మకం

Arun Chilukuri
Updated on: 28 Jan 2021 3:30 PM IST
ఎన్టీఆర్‌, రాంచరణ్‌కు అక్టోబర్‌ భయం.. దర్శకధీరుడిపైనే నమ్మకం
X

ఎన్టీఆర్‌, రాంచరణ్‌కు అక్టోబర్‌ భయం.. దర్శకధీరుడిపైనే నమ్మకం

యంగ్ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, రాంచరణ్‌కు అక్టోబర్‌ భయం పట్టుకుంది. అదేంటి త్రిబుల్‌ ఆర్‌ అక్టోబర్ 13న రిలీజ్ అవుతుంది కదా..? ఇంకా భయం ఎందుకనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చూడండి.

అక్టోబర్‌ అంటే దసరా హాలిడేస్‌. పండగ వాతావరణం ఉంటుంది. ఆ సమయంలో మూవీస్‌ రిలీజైతే ప్రేక్షకులు అధిక సంఖ్యలోనే వస్తారు. కానీ అక్టోబర్‌ అంటేనే భయపడుతున్నారు జూనీయర్ ఎన్టీఆర్, రాంచరణ్. ఎందుకంటే గతంలో ఈ ఇద్దరు నటించిన పలు సినిమాలు అక్టోబర్‌లో రిలీజ్‌ అయి ప్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి.

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ఊసరవెల్లి, రామయ్యా వస్తావయ్యా, అరవింద సమేత సినిమాలు అక్టోబర్‌లో రిలీజ్‌ అయినవే. కానీ ఏ మూవీ కూడా హిట్‌ లిస్ట్‌లో చేరలేదు. ఊసరవెల్లి, రామాయ్యా వస్తావయ్యా లాంటి డిజాస్టర్‌ను ఎన్టీఆర్ ఇప్పటికీ మర్చిపోడు. ఇక రాంచరణ్ నటించిన గోవిందుడు అందరివాడే, బ్రూస్ లీ సినిమాలు కూడా అక్టోబర్ లో రిలీజై చెర్రీ కెరీర్‌లోనే పెద్ద ప్లాప్‌లుగా మిగిలాయి.

ఇక ఇప్పుడు త్రిబుల్‌ ఆర్‌తో మరోసారి ఈ ఇద్దరు హీరోలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో చెర్రీ, తారక్‌ ఫ్యాన్స్‌కు భయం పట్టుకుంది. దర్శక ధీరుడు రాజమౌళిపై ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ అక్టోబర్‌ భయం మాత్రం అభిమానుల్లో టెన్షన్‌ పుట్టిస్తోంది.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story