Niharika - Chaitanya: నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ

* నిహారిక భర్త న్యూసెన్స్‌ చేస్తున్నాడంటూ అపార్ట్‌మెంట్‌ వాసుల ఫిర్యాదు *అపార్ట్‌మెంట్‌ వాసులపై నిహారిక భర్త కంప్లయింట్

Sandeep Reddy
Updated on: 5 Aug 2021 1:09 PM IST
Nuisance Case on Mega Brother Nagababu Daughter Niharika Husband Chaitanya
X

నిహారిక చైతన్య (ట్విట్టర్ ఫోటో)

Niharika - Chaitanya: మెగాబ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ చోటుచేసుకుంది. నిహారిక భర్త చైతన్య న్యూసెన్స్‌ చేస్తున్నాడంటూ అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అపార్ట్‌మెంట్‌ వాసులపై నిహారిక భర్త చైతన్య కూడా కంప్లయింట్ చేయడంతో పరస్పర ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికకు, గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు తనయుడు చైతన్యకు 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ ఉదయ్ విలాస్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ పెళ్లి వేడుకల్లో మెగా కుటుంబంతో పాటు సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక నిహారిక పెళ్లికి ముందు పలు సినిమాలతో పాటు బుల్లితెరపై యాంకర్‌గానూ మెరిసింది. ఇక తను నటించిన సినిమాలన్నీ ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story