Jr.NTR: #ఎన్టీఆర్30 కి ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర బృందం

#NTR30: త్వరలో జరగనున్న #ఎన్టీఆర్30 ముహూర్తం వేడుక

Jyothi
Updated on: 16 Feb 2023 9:00 AM IST
The Film Team Fixed the Moment For #NTR30
X

#ఎన్టీఆర్30 కి ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర బృందం

#NTR30: "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమాని ప్రకటించి చాలా కాలం అయింది. ఆచార్య సినిమాతో మొట్టమొదటి డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సినిమా మాత్రం మొదలు పెట్టడం లేదు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గత కొంతకాలంగా ఎన్టీఆర్ అభిమానులు సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇవ్వమని నిర్మాతలను టార్గెట్ చేస్తున్నారు. అయితే అతి త్వరలోనే సినిమాకి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈనెల 24వ తేదీన ఎన్టీఆర్30 సినిమాకి సంబంధించిన ముహూర్తం ఈవెంట్ భారీ స్థాయిలో జరగబోతుందట. అయితే ఈ వేడుకకి "ఆర్ఆర్ఆర్" బృందం కూడా రాబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది అని తెలుస్తోంది. "సీతారామం" బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Jyothi

Jyothi

Next Story