ఎన్టీఆర్ 30 సినిమా అలా ఉండబోతోంది అంటున్న కొరటాల శివ

*జూన్ నుంచి పట్టలెక్కబోతున్న #ఎన్టీఆర్30

admin1
Updated on: 19 April 2022 2:42 PM IST
#NTR30 Movie Shooting Will Start from June | Telugu News
X

జూన్ నుంచి పట్టలెక్కబోతున్న #ఎన్టీఆర్30

NTR30 Movie: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఎన్టీఆర్(NTR) తన కెరియర్ లో మరొక మైలురాయిని అందుకున్నారు. "బాహుబలి2" కలెక్షన్ లను సైతం తిరగరాస్తూ "ఆర్ ఆర్ ఆర్" సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం కొరటాల శివ తో చేతులు కలపనున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మరియు తారక్ కాంబినేషన్లో "జనతాగ్యారేజ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

"జనతా గ్యారేజ్" సినిమాలో ఎన్టీఆర్ పాత్ర విభిన్నంగా ఉంటుంది. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది కథ ఎలా ఉండబోతోంది అని చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొరటాల శివ(Koratala Siva) సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. బోలెడన్ని భావోద్వేగాలతో ఉండే ఒక చక్కని కథ ఇది అని అన్నారు కొరటాల శివ. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలవుతుంది అని క్లారిటీ ఇచ్చారు.

admin1

admin1

Next Story