NTR 30: 60 శాతం స్క్రిప్ట్ ని మార్చబోతున్న కొరటాల..

NTR30 Getting More Delayed
x

NTR 30: 60 శాతం స్క్రిప్ట్ ని మార్చబోతున్న కొరటాల..

Highlights

#ఎన్టీఆర్30 స్క్రిప్ట్ విషయంలో జరగనున్న మార్పులు

NTR 30: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా రెండు మూడు పెద్ద సినిమాలు ఈ మధ్యనే లాంచ్ కాగా #ఎన్టీఆర్30 సినిమాను కూడా లాంచ్ చేస్తారు అని అభిమానులు ఆశించారు కానీ కొరటాల శివ నుంచి మాత్రం ఏ రెస్పాన్స్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. దానికి కారణం కొరటాల శివ స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేయాలనుకోవడం అని సమాచారం.

ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయింది కానీ కొరటాల శివ మాత్రం దాదాపు 60% స్క్రిప్ట్ ని పక్కన పడేసి మరొక కొత్త వర్షన్ రాయాలని నిర్ణయించుకున్నారట. దీనికి కనీసం రెండు నెలలైనా సమయం పడుతుంది. అప్పటిదాకా ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కే అవకాశం లేదు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది అనుకుంటూ ఉండగా కొరటాల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories