NTR New Movie: విద్యార్థి నాయ‌కుడిగా ఎన్టీఆర్!

NTR New Movie: కొరాటాల శివ దర్శకత్వంలో విద్యార్థి నాయుడిగా ఎన్టీఆర్ నటిస్తున్నట్లు టాలీవుడ్ టాక్.

Kranthi
Updated on: 1 May 2021 2:10 PM IST
NTR Will Act as Student Politician in Koratala Siva New Movie
X
జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఇమేజ్)

NTR New Movie: సినిమా ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాసిన సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమాకు దర్శకత్వం కొరటాల శివ దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ కథానాయకుడుగా నటించిన విషయం తెలిసిందే. మరో సారి వీరి కాంబోలో ఓ మూవీ రూపొందుతోంది. ఎన్టీఆర్ 30వ చిత్రంగా రానున్న ఈ సినిమాకు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొర‌టాల శివ ప్ర‌స్తుతం ఆచార్య సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు.

ఇక ఎన్టీఆర్ రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్‌.ఆర్‌.ఆర్ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే ఈ కొత్త చిత్రం ప్రారంభం కానుంది.

ఈ సినిమా రాజ‌కీయాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంద‌ని టాలీవుడ్ టాక్. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయ‌కుడిగా క‌నిపిస్తాడ‌ని, రాజ‌కీయాల కార‌ణంగా విద్యార్థుల భ‌విష్య‌త్తు పాడ‌వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో బ‌రిలోకి దిగే పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆయ‌న అభిమానులు అడ‌పాద‌డ‌పా కోరుకుంటున్న త‌రుణంలో ఇలాంటి క‌థాంశంతో సినిమా రానుంద‌న్న వార్త‌లు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

Kranthi

Kranthi

Next Story