NTR: నాటు నాటు పాట డాన్స్ కి ఎన్ని టేకులు పడ్డాయో తెలుసా?

NTR: నాటు నాటు పాటలో డాన్స్ గురించి మాట్లాడిన ఎన్టీఆర్

admin1
Updated on: 23 Nov 2021 7:15 PM IST
NTR Tells About Naatu Naatu Song in RRR Movie
X

నాటు నాటు సాంగ్ కు ఎన్ని టేకులు తీసుకున్నామో చెప్పిన ఎన్టీఆర్ (ఫైల్ ఇమేజ్)

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే తన తదుపరి సినిమా అయినా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే ఇక చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉంది దర్శక నిర్మాతలు బిజీ అయ్యారు ఈ నేపథ్యంలోనే సినిమా నుంచి రెండవ స్పాట్ అని విడుదలచేశారు నాటు అనే ఒక్క ఫాస్ట్ బీట్ పాటతో అందరి దృష్టిని ఆకర్షించింది చిత్రబృందం ముఖ్యంగా అందులో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వేసిన స్టెప్ అభిమానులకు కన్నుల విందు చేశాయి పాట కంటే ఎక్కువగా చెర్రీ మరియు తారక్ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో ట్రైనింగ్ గా మారాయి

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఈ పాట చిత్రీకరణ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. "మేము ఒకటి తర్వాత మరో టేక్ చేస్తూ ఉన్నాము. కాలు ఫస్ట్ ఎడమ వైపుకి తిప్పాలి తర్వాత కుడివైపు తర్వాత ముందుకి వెనక్కి ఇట్లా ఈ స్టెప్ పెర్ఫెక్ట్ గా రావడానికి 15 నుంచి 18 టేకులు తీసుకోవాల్సి వచ్చింది. డైరెక్టర్ రాజమౌళి మా ఇద్దరి స్టెప్పులు సింక్ లో ఉండాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నారు. స్టెప్పు రికార్డ్ అయ్యాక మళ్లీ వెనక్కి వెళ్లి కాళ్ళ మూమెంట్, తర్వాత మా చేతులు చూసి ఆ తర్వాత ఇద్దరి స్టెప్పులు సింక్ అయ్యాయా లేదా అని చూశారు," అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.

admin1

admin1

Next Story