NTR: వెకేషన్ లో కూడా ఎన్టీఆర్ కు ఎన్ని కష్టాలో పాపం

NTR: Sweats In Gym For Devara Despite On Holiday
x

NTR: వెకేషన్ లో కూడా ఎన్టీఆర్ కు ఎన్ని కష్టాలో పాపం

Highlights

NTR: వెకేషన్ అంటే ఏంటి..ఫ్యామిలీతో జాలీగా ఎంజాయ్ చేయడం..ఔనా..కానీ ఎన్టీఆర్ వెకేషన్ కు వెళ్లాడే అన్నమాట కానీ.. షూటింగ్ కష్టాలు మాత్రం ఆయన్ను వెంటాడుతున్నాయి.

NTR: వెకేషన్ అంటే ఏంటి..ఫ్యామిలీతో జాలీగా ఎంజాయ్ చేయడం ఔనా కానీ.. ఎన్టీఆర్ వెకేషన్ కు వెళ్లాడే అన్నమాట కానీ.. షూటింగ్ కష్టాలు మాత్రం ఆయన్ను వెంటాడుతున్నాయి. ఎన్టీఆర్ దర్శకుడు కొరటాలశివ కాంబినేషన్ లో దేవర చిత్రం చేస్తున్న విషయం మనకు తెలిసిందే కదా. ఇందులో యంగ్ టైగర్ సరసన శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవర చిత్రానికి సంబంధించి ఇటీవలే ఒక భారీ షెడ్యూల్ ని ఎన్టీఆర్ పూర్తి చేసుకున్నాడు.

నెక్ట్స్ షెడ్యూల్ కి గ్యాప్ రావడంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీని తీసుకొని సమ్మర్ వెకేషన్ కు విదేశాలకు వెళ్లాడు. అయితే విదేశాలకు వెళ్లిన ఎన్టీఆర్ ఎంచక్కా తన ఫ్యామిలీతో కలిసి విహార యాత్ర చేస్తాడు అనుకుంటే మనోడు మాత్రం జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నాడు. స్పెషల్ గా ఒక ట్రైనర్ ను పెట్టుకొని జిమ్ లో చెమటలు చిందిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ వర్కౌట్స్ చేస్తున్న ఫోటోను చూసి నెటిజన్స్ తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది..హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా..ఇలా కండలు పెంచే కష్టాలు ఎందుకని ప్రశ్నిస్తుంటే..వెకేషన్ లో ఉన్నా సైతం బాడీ షేప్ అవుట్ అవ్వకుండా ఎన్టీఆర్ కష్టపడుతున్నాడు..అతడి డెడికేషన్ కు ఇదే నిదర్శనం అని కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. ఎన్టీఆర్ డెడికేషన్ గురించి మనకు తెలియంది కాదు. పాత్ర కోసం తనని తాను మార్చుకోవడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడు. RRR మూవీలో కొమరం భీమ్ లుక్ కోసం చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు దేవర కోసం కూడా అదే డెడికేషన్ చూపిస్తున్నాడు.

దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని సమాచారం. రెండు పాత్రల మధ్య వ్యత్యాసం చూపించేందుకే ఎన్టీఆర్ ఇలా జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడట. ఇక, రీసెంట్ గా రిలీజ్ చేసిన దేవర ఫస్ట్ లుక్ లో మాస్ అవతార్ లో అదరగొట్టేశాడు. చేతిలో ఆయుధం, పంచె కట్టుతో ఆయన గెటప్ చూసి నందమూరి అభిమానులే కాదు..సినీ లవర్స్ సైతం సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు. దేవర మూవీని 2024 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories