RRR మూవిలో ఎన్టీఆర్ స్టిల్స్ లీక్

RRR movie: దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది.

Kranthi
Published on: 4 March 2021 9:37 AM IST
NTR stills leak in RRR movie
X

ఫైల్ ఇమేజ్


RRR movie: దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది.ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి ఈ చిత్రంలో పులితో ఫైట్‌ ఉంటుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఫైట్‌కి సంబంధించిన కీలకమైన ఫొటో కూడా లీక్‌ కావడం ఇప్పుడు చిత్రయూనిట్‌ని కలవరపెడుతున్నట్లు సమాచారం.

Kranthi

Kranthi

Next Story