NTR: రామ్ చరణ్‌కు స్పెషల్ విషెస్ చెప్పిన ఎన్టీఆర్ ‌

NTR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 36వ పడిలోకి అడుగుపెట్టాడు. ఇవాళ చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Samba Siva Rao
Published on: 27 March 2021 4:18 PM IST
Ramcharan NTR
X

ఎన్టీఆర్ రాంచరణ్ (సోర్స్ ట్విట్టర్ )

NTR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 36వ పడిలోకి అడుగుపెట్టాడు. ఇవాళ చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో భాగంగా రామ్ చరణ్‌కి ఎన్టీఆర్ స్పెషల్ విషెష్ చెప్పారు. ''ఈ సంవత్సరం నాకు ఎంతో గొప్పగా సాగింది. నా సోదరుడు(రామ్ చరణ్)తో గడిపిన క్షణాలను ఎల్లప్పుడూ గుర్తుంటాయి. జన్మదిన శుభాకాంక్షలు @alwaysramcharanఅంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా వీరిద్దరికి చెందిన ఫోటో ఒకటి షేర్ చేశారు. అందులో ఎన్టీఆర్ ఎంతో ఆత్మీయంగా రామ్ చరణ్ భుజంపై తలవాల్చినట్లు ఉంది.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ‌్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్‌‌గా ఆర్ఆర్ఆర్('రౌద్రం రణం రుధిరం')సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కరోనా వైరస్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఈ ఏడాది మళ్లీ చిత్రీకరణ ప్రారంభించారు. దాదాపు షూటింగ్ చివరి దశలో ఉంది. ఫ్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ , అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్‌కు టాలీవుడ్ జక్కన్న అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. చరణ్ పుట్టినరోజు స్పెషల్‌గా RRR నుంచి అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ షేర్ చేశారు. అందులో కండలు తిరిగిన దేహంతో, కాషాయ వస్త్రాలు ధరించి విల్లునెక్కు పెడుతున్న అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ను చూస్తుంటే ఒళ్లు గగురుపొడుస్తోంది. చరణ్‌ నట విశ్వరూపం చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

'ఆచార్య' సినిమా నుంచి చరణ్ పోషిస్తున్న 'సిద్ద' లుక్‌ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. చరణ్ బర్త్ డే పోస్టర్‌గా రిలీజ్ చేసిన ఈ లేటెస్ట్ లుక్‌లో 'సిద్ద' 'ఆచార్య'తో కలిసి ఉండగా మెగా అభిమానుల్లో..సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేదిగా ఉండటం విశేషం.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story