NTR - Kalyan Ram: కళ్యాణ్ రామ్ మూవీలో ఎన్టీఆర్ స్పెషల్ రోల్?

NTR - Kalyan Ram: కళ్యాణ్ రామ్ మూవీ ‘బింబిసార’ ప్రాజెక్టులో ఎన్టీఆర్ స్పెషల్ రోల్ చేయనున్నట్లు టాలీవుడ్ టాక్.

Kranthi
Published on: 8 Jun 2021 9:55 AM IST
NTR Special Role in Kalyan Ram Latest Bimbisara Project
X

NTR - Kalyan Ram:(File Image) 

NTR - Kalyan Ram: తమ్ముడు కష్టాల్లో ఉంటే అన్నయ్య ఆదుకుంటాడు. కాని ఇక్కడ అన్నయ్య కష్టాల్లో ఉంటే తమ్ముడు ఆదుకుంటున్నాడు. నాన్న చనిపోయాక ఆ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నట్లు కనపడుతోంది. హరికృష్ణ ఇద్దరి కుమారులు కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ మొదటి నుంచి కలిసే ఉండేవారు. హరికృష్ణ మరణం వారిద్దరినీ మరింత దగ్గర చేసింది. ఎన్టీఆర్ అయితే ఆ కుటుంబానికి పెద్దగా మారి.. అన్నీ చూసుకుంటున్నట్లుగా కనపడుతోంది.కల్యాణ్ రామ్ కోసం తాను స్వయంగా సినిమా చేయటమే గాక.. తన సినిమాలకు కల్యాణ్ నిర్మాతగా ఉండేలా ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్.. కల్యాణ్ తీసే సినిమాలకు సపోర్టింగ్ రకరకాలుగా చేస్తున్నాడు.

కల్యాణ్ లేటెస్ట్ ప్రాజెక్ట్ బింబిసారకు సైతం ఎన్టీఆర్ కాంట్రిబ్యూషన్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదలైన టైటిల్ మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ప్రాజెక్ట్‌ లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించనున్నారు. అంటే ఈ సినిమాకు అత్యంత కీలకమైన కథను పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్ థెరిసాతో పాటు సంయుక్త మీనన్ హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు.

గతంలో ఎన్టీఆర్ రామ్ హీరోగా నటించిన 'రామ రామ కృష్ణ కృష్ణ' సినిమాకు వాయిస్ ఓవర్ అందించారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ సినిమాకు తన గాత్రాన్ని అందిస్తున్నారు. 'బింబిసార' విషయానికొస్తే.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో చారిత్రక అంశాలతో ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు.

Kranthi

Kranthi

Next Story