Jr NTR: విశ్వక్ సేన్ కి ఇదే ఆఖరి సినిమా అవ్వాలి...

NTR Says It would be Better if Vishwak Sen Stopped Directing
x

"విశ్వక్ సేన్ దర్శకత్వం మానేస్తే బాగుంటుంది" అంటున్న ఎన్టీఆర్

Highlights

"విశ్వక్ సేన్ కి ఇదే ఆఖరి సినిమా అవ్వాలి" అంటున్న స్టార్ హీరో

JR NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ యువ హీరో విశ్వక్ సేన్ "దాస్ కా ధంకీ" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. విశ్వక్ సేన్ సినిమా గురించి మాత్రమే కాకుండా "ఆర్ఆర్ఆర్" కు ఆస్కార్ అవార్డు గురించి కూడా మాట్లాడారు ఎన్టీఆర్. కీరవాణి మరియు చంద్రబోస్ వంటి తెలుగువాళ్ళు ఆస్కార్ అవార్డుని అందుకోవటం చూసి చాలా సంతోషంగా అనిపించిందని అన్నారు ఎన్టీఆర్.

ఇక విశ్వక్ సేన్ గురించి మాట్లాడుతూ, "నేను విశ్వక్ సేన్ లాగా మాట్లాడలేను. తను ఒక ఎనర్జీ బాల్. నాకంటే చాలా బాగా మాట్లాడతాడు. తను మాట్లాడుతున్నప్పుడు నేను కూడా సైలెంట్ అయిపోతాను. ఈ వేడుకకి రావటం నా బాధ్యత. 'ఈ నగరానికి ఏమైంది' సినిమాని నేను ఇప్పటికీ ఎప్పుడైనా మూడ్ బాగోకపోతే చూస్తూ ఉంటాను. అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో విశ్వక్ సేన్ మెచ్యూర్ పర్ఫామెన్స్ చూసి నేను షాక్ అయ్యాను," అని అన్నారు తారక్. "ఎప్పుడూ ఒకేలాంటి సినిమాలు కాకుండా ఇలాంటి విభిన్న సినిమాలు చేస్తూ విశ్వక్ సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడు.

హిట్ సినిమా తర్వాత మేమిద్దరం ఒకసారి లంచ్ కి కలిసాము. అప్పుడు తనను తాను ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని ఉంది అన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ తనలో ఎప్పుడు ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇకపై విశ్వక్ సేన్ డైరెక్షన్ ఆపేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నీలాంటి యువ హీరోలతో పని చేయడానికి ఎంతో మంది యువ డైరెక్టర్లు వేచి చూస్తున్నారు. ఇది తెలుగు సినిమాకి ఒక గోల్డెన్ పిరియడ్ లాంటిది. అలాంటి టాలెంట్ ని మనం ఎంకరేజ్ చేయాలి. నీ డైరెక్షన్ లో ఇదే నువ్వు చేస్తున్న లాస్ట్ మూవీ అవ్వాలి అనుకుంటున్నాను. విశ్వక్ సేన్ చాలా ప్యాషనేట్ హీరో. అలాంటి వారిని ఎంకరేజ్ చేయాలి," అని అన్నారు ఎన్టీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories