NTR: ఆ పాత్రలో నేను చేసి ఉంటే బాగుండేది అనిపించింది అంటున్న ఎన్టీఆర్

NTR: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "ఆర్ ఆర్ ఆర్". అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

admin1
Updated on: 29 Jan 2022 4:43 PM IST
NTR saying it would have been nice if I had done that role
X

 ఆ పాత్రలో నేను చేసి ఉంటే బాగుండేది అనిపించింది అంటున్న ఎన్టీఆర్ 

NTR: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "ఆర్ ఆర్ ఆర్". అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఈ మధ్యనే విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇందులో రామరాజు పాత్రలో రామ్ చరణ్ నిప్పులపై దూకి బాణం సంధించే సన్నివేశం హైలైట్ గా నిలిచింది. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సన్నివేశం గురించి ఎన్టీఆర్ కొన్ని ఆసక్తి కరమైన కామెంట్లు చేశారు.

ఆ సీన్ తనకి చాలా బాగా నచ్చిందని ఆ పాత్రలో తాను నటించాలి అనిపించేంతగా అనిపించిందని తారక్ చెప్పుకొచ్చారు. ఇక అప్పుడు వచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ వల్ల కూడా అలా అనిపించి ఉండొచ్చు అని అన్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమాని మార్చి 18న విడుదల చేద్దామని అనుకుంటే కర్ణాటకలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో దర్శక నిర్మాతలు విడుదల తేదీని మళ్ళీ ఏప్రిల్ కి పోస్ట్ పోన్ చేశారు. ఇదే కనుక జరిగితే "ఎఫ్ 3" సినిమా వాయిదా పడాల్సి వస్తుంది. "ఆర్ ఆర్ ఆర్" విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

admin1

admin1

Next Story