RRR : ఎన్టీఆర్ సరికొత్త రికార్డు!

RRR : ఎన్టీఆర్ సరికొత్త రికార్డు!
x
Highlights

ఇక ఇదిలా ఉంటే కొమురం భీం జ‌యంతి సంద‌ర్భంగా రిలీజ్ చేసిన కొమరం భీమ్ టీజ‌ర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ టీజర్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. టాలీవుడ్‌లో తొలిసారి మిలియ‌న్ లైక్స్ సాధించిన టీజ‌ర్‌ గా రికార్డు సృష్టించింది.

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం RRR.. మొదటిసారిగా అగ్ర హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా.

ఇక ఇదిలా ఉంటే కొమురం భీం జ‌యంతి సంద‌ర్భంగా రిలీజ్ చేసిన కొమరం భీమ్ టీజ‌ర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ టీజర్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. టాలీవుడ్‌లో తొలిసారి మిలియ‌న్ లైక్స్ సాధించిన టీజ‌ర్‌ గా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా మొట్ట‌మొదటి ల‌క్ష కామెంట్స్ సంపాదించిన టీజ‌ర్‌గానూ రికార్డ్ క్రియేట్ చేసింది. వీటికి తోడు ఫాస్టెస్ట్ గా 30 మిలియ‌న్ వ్యూస్ సాధించిన టీజ‌ర్‌గాను రికార్డును నమోదు చేసింది. దీనితో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

లాక్ డౌన్ వలన ఇన్నిరోజులు వాయిదా పడిన ఈ సినిమా తాజాగా మొదలైంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరు కలిసి నటిస్తుండడం, బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తరవాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అజయ్ దేవగన్, శ్రియ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories