బుల్లితెర ప్రేక్షకుల కోసం మరోసారి ఎన్టీఆర్

బుల్లితెర ప్రేక్షకుల కోసం మరోసారి ఎన్టీఆర్
x
Highlights

టెంపర్ సినిమా నుంచి వరుస సినిమాలతో హిట్ కొడుతూ దూసుకుపోతున్నారు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్.. అయితే ఇప్పుడు మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నారు ఎన్టీఆర్.

టెంపర్ సినిమా నుంచి వరుస సినిమాలతో హిట్ కొడుతూ దూసుకుపోతున్నారు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్.. అయితే ఇప్పుడు మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ హోస్ట్ గా ఓ రియాల్టీ షోను ప్లాన్ చేస్తున్నారట.. ఇప్పటికే ఈ రియాల్టీ షో కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్‌ వేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. గతంలో ఎన్టీఆర్ తెలుగులో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్ తో పాటుగా రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 2021 జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమా పైన భారీ అంచనాలు పెరిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories