NTR Health Update: ఎన్టీఆర్‌ హెల్త్‌ అప్‌డేట్స్‌ పంచుకున్న చిరంజీవి

NTR Health Update: జూనియర్ ఎన్టీఆర్ కు క‌రోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాడు.

Venkata Chari
Published on: 12 May 2021 3:10 PM IST
NTR Health is Good and He is Fine now Says Megastar Chiranjeevi
X

చిరంజీవి, ఎన్టీఆర్ (ఫొటో ట్విట్టర్)

NTR Health Update: జూనియర్ ఎన్టీఆర్ కు ఈనెల ౧౦న క‌రోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైల్‌లో ఉన్నారు.

ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, డాక్టర్ల సలహా మేరకు చికిత్స తీసుకుంటు, జాగ్రత్తలు పాటిస్తున్నానని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి.

ఎన్టీఆర్‌తో ఈ రోజు ఫోన్‌లో సంభాషించానని, ఆయన ఆరోగ్యంగా సూపర్‌గా ఉందని మెగాస్టార్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ఆరోగ్యంపై అప్‌డేట్‌ను పంచుకున్నారు.

'కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ home quarantine లో ఉన్నారు. He and his family members are doing good. తను చాలా ఉత్సాహంగా, energetic గా ఉన్నారని తెలుసుకుని I felt very happy. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. God bless @tarak9999' అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్టర్లో రాసుకొచ్చారు.

ప్రస్తుతం చిరంజీవి ఆచార్య, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలు కరోనాతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే.


Venkata Chari

Venkata Chari

Next Story