NTR: తదుపరి సినిమాల గురించి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్

NTR: ఈ సినిమాల షూటింగ్ అప్పుడే మొదలవుతుంది అంటున్న ఎన్టీఆర్

admin1
Updated on: 23 Nov 2021 6:00 PM IST
NTR Gives a Clarity on Next Movies Shooting Start
X

జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఇమేజ్)

NTR: ఈ మధ్యనే "ఆర్ ఆర్ ఆర్" సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ కొన్ని వారాల పాటు షూటింగులకు దూరంగా ఉందామని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం "ఆర్ ఆర్ ఆర్" చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తాజాగా ప్రముఖ హాలీవుడ్ మీడియా 'వెరైటీ' ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఎన్టీఆర్ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉండబోతోందని తెలిసిన విషయమే.

#ఎన్టీఆర్ 30 అని పిలవబడే పిలవబడుతున్న ఈ సినిమా షూటింగ్ ఒక రివెంజ్ డ్రామాగా తెరకెక్కనుందట. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలియజేశారు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక ఈ రెండు సినిమాల లో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది అని, ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలు చేయబోతున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

admin1

admin1

Next Story