Bimbisara: టీజర్ కోసం ఎన్టీఆర్ ని రంగంలోకి దింపిన "బింబిసార" బృందం

* "బింబిసార" టీచర్లు వినిపించనున్న ఎన్టీఆర్ వాయిస్

admin1
Updated on: 27 Nov 2021 9:30 PM IST
NTR Gave Voice Over to Kalyan Ram Bimbisara Movie Teaser
X

టీజర్ కోసం ఎన్టీఆర్ ని రంగంలోకి దింపిన "బింబిసార" బృందం(ఫోటో- ది హన్స్ ఇండియా)

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా "బింబిసార" అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఒక క్రూరమైన రాజు కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ పీరియడ్ డ్రామా లో క్యాథరిన్ తెరిసా మరియు సంయుక్త మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్ర టీజర్ ని నవంబర్ 29న విడుదల చేయబోతున్నట్లు గా దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం టీజర్ లో మనకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొంతు కూడా వినిపించబోతోందట.

తన సోదరుడు కళ్యాణ్ రామ్ సినిమా కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీజర్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి అని చెప్పుకోవచ్చు. మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాని కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 24 న థియేటర్లలో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story