Ntr fires on fans: కాస్త ఆగుతారా? అభిమానులపై ఎన్టీఆర్ అసహనం.. వీడియో వైరల్

Ntr fires on fans: బెంగళూరులో ఎన్టీఆర్ ఒక వేదికపై మాట్లాడుతుండగా హంగామా చేసిన ఫాన్స్. తీవ్రంగా హెచ్చరించిన ఎన్టీఆర్ వీడియో వైరల్

KVD Varma
Published on: 9 March 2026 8:44 AM IST
Ntr fires on fans: బెంగళూరులో ఎన్టీఆర్ ఒక వేదికపై మాట్లాడుతుండగా హంగామా చేసిన ఫాన్స్.
X

Ntr fires on fans

Ntr fires on fans: ఒక్కోసారి హీరోల అభిమానులు చేసే అల్లరి.. అతి.. సాధారణ ప్రజలకే కాదు ఆ హీరోలకే కూడా పిచ్చ కోపం తెప్పిస్తుంది. సందర్భం లేకుండా.. కేకలు. అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి సంబంధం లేని నినాదాలు.. ఎవరు మాట్లాడుతున్నా తమ హీరో పేరునే గట్టిగా అరుస్తూ అల్లరి చేయడం ఇలాంటి పనులతో అందరికీ విసుగు తెప్పిస్తుంటారు. అంతెందుకు తమ అభిమాన హీరోను చూడటానికి వచ్చిన వారు.. ఆయన మాట్లాడే నాలుగు మాటలు వారు వినరు.. వినాల్సిన జనాన్ని విననీయరు. ఇలాంటి సందర్భాల్లో పాపం చాలామంది హీరోలు ఇబ్బంది పడుతుంటారు. కానీ, అభిమానులను ఏమీ అనలేక నిస్సహాయంగా ఉంటారు. లేదా పదే పదే బ్రతిమిలాడుతారు. సైలెంట్ గా ఉండండి అని. కానీ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అలా కాదు. తన అభిమానులైనా సరే గీత దాటి అల్లరి చేస్తే కచ్చితంగా అదుపు చేయడానికి కోప్పడతారు. వారిని తీవ్రంగా హెచ్చరిస్తారు. ఇదిగో ఇలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు జరిగింది. ఆ వివరాలు మీకోసం..

Ntr fires on fans: జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం (మార్చి 8) బెంగళూరు వెళ్లారు. KIMS హాస్పిటల్ కొత్త యూనిట్‌ను ప్రారంభించడానికి ఆయన అక్కడికి చేరుకున్నారు. ఈవెంట్ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడుతున్నప్పుడు, అభిమానులు మితిమీరిన అల్లరి చేశారు. ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అనూ నినాదాలు చేశారు. అసలు ఎన్టీఆర్ ఒక్క మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వని విధంగా అభిమానుల కేకలు ఉన్నాయి. దీంతో అక్కడ ఉన్న వారంతా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఎన్టీఆర్ కూడా ఒక దశలో సహనం కోల్పోయారు. దాంతో అభిమానులను జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ప్రతి పురుషుడికి ఆ సంస్కృతి ఉండాలి..

KIMS యూనిట్ ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళడానికి ఒక కారణం ఉంది. 1983లో, జూనియర్ ఎన్టీఆర్ తాత ఎన్టీఆర్ స్వయంగా KIMS కు శంకుస్థాపన చేశారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు, ఆయనకు KIMSలో చికిత్స అందించారు. ఈ కారణంగా, ఆయన KIMS కొత్త యూనిట్ ప్రారంభోత్సవానికి బెంగళూరు వెళ్లారు. ఆయన అభిమానులు ఆయనను ఆనందంతో స్వాగతించారు. ఆయనను చూడటానికి భారీ సంఖ్యలో జనం అక్కడకు వచ్చారు.

Ntr fires on fans: ఇక మార్చి 8 మహిళా దినోత్సవం. అందుకే ఆయన ఆ విషయంపై మాట్లాడారు. 'మహిళలను ఎలా గౌరవించాలో పదే పదే చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ప్రతి పురుషుడు ఆ సంస్కృతితో పుట్టాలి' అని ఆయన అన్నారు. తన పిల్లలకు మహిళలను గౌరవించడం నేర్పుతానని కూడా ఆయన చెప్పారు. సినిమాల్లోనే కాదు, బయట కూడా చాలా నిరాడంబరంగా ప్రవర్తించే ఎన్టీఆర్, మహిళల భద్రత, గౌరవం గురించి చాలా బాగా మాట్లాడినందుకు ప్రశంసలు అందుకున్నారు. ఆయన తన అభిమానుల గురించి కూడా మాట్లాడారు. జాగ్రత్తగా ఇంటికి వెళ్లమని సలహా ఇచ్చారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడటం ప్రారంభించగానే అభిమానులు ఆయన పేరు తో నినాదాలు చేశారు. కొద్దిసేపు అభిమానుల అరుపులతో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన కాస్త కఠినంగానే.. నిశ్శబ్దంగా ఉండు, నిశ్శబ్దంగా ఉండు అని హెచ్చరించడంతో అభిమానులు నిశ్శబ్దంగా మారిపోయారు.



KVD Varma

KVD Varma

Next Story