Acharya Movie: ఆచార్య రిజల్ట్..టెన్షన్లో తారక్?

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి, చరణ్‌ నటించిన తాజా చిత్రం ఆచార్య.

Arun Chilukuri
Updated on: 30 April 2022 3:00 PM IST
NTR Fans Fear With Acharya Movie Results
X

Acharya Movie: ఆచార్య రిజల్ట్..టెన్షన్లో తారక్? 

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి, చరణ్‌ నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ నిన్న రిలీజైంది. సినిమా చూసిన పలువురు వారి అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. సినిమా బాగుందని కొందరు, యావరేజ్‌, బాగోలేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి వల్లే ఆచార్యకు ఇలాంటి ఫలితం వచ్చిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆచార్యకు, రాజమౌళికి సంబంధం ఏంటంటారా? మరేం లేదు. రాజమౌళి కెరీర్‌లో తీసిన ప్రతి సినిమా సూపర్‌ హిట్టే. అయితే రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాతి చిత్రం పరాజయం చెందుతుందనే నానుడి ప్రారంభం నుంచి టాలీవుడ్‌లో వినిపిస్తుంది.

దీన్ని `రాజమౌళి సెంటిమెంట్‌గా సినీ అభిమానులు, చిత్ర పరిశ్రమ వర్గాలు పిలుచుకుంటారు. అదే నమ్ముతుంటారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత చరణ్‌ నటించిన `ఆచార్య` పరాజయం రాజమౌళి సెంటిమెంట్‌కి బలాన్నిస్తుందని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. దీంతో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌లో టెన్షన్‌ మొదలైంది. ఎన్టీఆర్‌తో కొరటాల శివ తీయబోయే ఎన్టీఆర్ 30వ సినిమా మీద కూడా ఎఫెక్ట్ పడేలా ఉంది. ఆచార్య చిత్రాన్ని వీక్షించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఈ సినిమా టాక్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కచ్చితంగా భయపడి ఉంటారు. అందుకే ఆచార్యతో పాటు ఎన్టీఆర్ 30వ సినిమా పేరు కూడా నెట్టింట్లో మార్మోగిపోయింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story