Devara Box Office Collection Day 1: వసూళ్లలో దుమ్మురేపుతోన్న దేవర.. తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతో తెలుసా.?

Devara Box Office Collection Day 1: ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 28 Sept 2024 3:25 PM IST
Devara Box Office Collection Day 1: వసూళ్లలో దుమ్మురేపుతోన్న దేవర.. తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతో తెలుసా.?
X

Devara Box Office Collection: వసూళ్లలో దుమ్మురేపుతోన్న దేవర.. తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతో తెలుసా.?

Devara Box Office Collection Day 1: ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 4 ఏళ్ల పాటు సుదీర్ఘంగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది.

విడుదలైన అన్ని చోట్ల ఈ సిమిమాకు మంచి టాక్‌ వచ్చింది. దీంతో ఊహించిన విధంగానే ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది. ఈ యాక్షన్‌ డ్రామా తొలి రోజు ఏకంగా రూ. 172 కోట్ల గ్రాస్ సాధించడం విశేషం. ప్రీ సేల్‌ బుకింగ్స్‌లోనే పలు రికార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఏకంగా రూ. 70 కోట్లకుపైగా రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి ప్రీ బిజినెస్‌ జరిగిన విషయం తెలిసిందే. ఇక మరో పెద్ద సినిమా విడుదల లేకపోవడం, వీకెండ్‌ కలిసి రావడంతో పాటు వచ్చే వారంలో దసరా సెలవులు కూడా ప్రారంభమవుతుండడంతో దేవర కలెక్షన్లను మరింత పెరగడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కాగా ఎన్టీఆర్‌ అద్భుత నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. డ్యూయల్‌ రోల్‌లో ఎన్టీఆర్‌ నటించిన తీరు అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఇక అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో విలన్‌గా సైఫ్‌ అలీఖాన్‌ నటించడంతో బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక దేవర విజయంపై యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు.

అభిమానులకు కృతజ్ఞతు చెబుతూ.. నా అభిమానుల వేడుకలు చూసి నా మనసు నిండింది. మీ ప్రేమాభిమానాలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. నాలానే మీరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది. మీకు మరెంతో వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్‌. మరి దేవర కలెక్షన్లు ఈ వీకెండ్ తర్వాత ఎలా ఉంటాయో చూడాలి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story