మెగా సినిమా ప్రమోషన్స్ లో నందమూరి హీరో

గత కొంతకాలంగా కేవలం డిజాస్టర్ లకు మాత్రమే అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి తేజ్ ప్రస్తుతం...
గత కొంతకాలంగా కేవలం డిజాస్టర్ లకు మాత్రమే అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి తేజ్ ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా 'చిత్రలహరి' పైనే పెట్టుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదపేతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ లు హీరోయిన్లుగా నటించారు. టీజర్ తో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది ఈ చిత్ర బృందం. తాజాగా 'చిత్రలహరి' సినిమా రిలీజ్ వేడుకలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఎప్పటిలాగానే ఏ మెగా హీరోను ముఖ్య అతిథిగా ఈ వేడుకకు విచ్చేస్తారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ సారి చిత్రబృందం నందమూరి నట వారసుడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. తారక్ కూడా వారి ఆహ్వానాన్ని మన్నించి చిత్రలహరి ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా విచ్చేసేందుకు ఒప్పుకున్నాడు. తేజ్ తనకి మంచి మిత్రుడు పైగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పతాకంపై నే తారక్ 'జనతాగ్యారేజ్' అనే సూపర్ హిట్ అందుకున్నాడు. అందుకే వారు పిలవగానే వెంటనే ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఈ వేడుక జరగనుంది.
Wrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMTఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రికి...
27 May 2022 12:48 PM GMT