Jr NTR: "తిట్టే హక్కు వాళ్ళకి ఉంది" అంటున్న తారక్

Jr NTR: *మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

admin1
Updated on: 22 March 2022 2:00 PM IST
NTR Chit Chat With Keeravani | Tollywood News
X

Jr NTR: "తిట్టే హక్కు వాళ్ళకి ఉంది" అంటున్న తారక్

Jr NTR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 25న థియేటర్లలో విడుదల కాబోతోంది. చిత్రబృందం ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కీరవాణి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి ఒక చిట్ చాట్ లో పాల్గొన్నారు. అందులో ఇప్పటి దాకా తన సమకూర్చిన సంగీతం లో ఏ సినిమా తనికి నచ్చలేదు అని అడగగా ఎన్టీఆర్ ఘరానా బుల్లోడు సినిమా నుంచి భీమవరం బుల్లోడా పాట తనకు ఇష్టం లేదని చెప్పారు.

పాట సూపర్ హిట్ అయినప్పటికీ ఆ పాటలోని లిరిక్స్ తనకు ఏమాత్రం నచ్చదని ఎన్టీఆర్ అన్నారు. మరో వైపు రామ్ చరణ్ కీరవాణి ఈమధ్యనే సంగీతాన్ని అందించిన ఒక పాట తనకి నచ్చలేదని కానీ దాని పేరు తనకి గుర్తు లేదని అన్నారు. వెంటనే ఎన్టీఆర్ అందుకుని మర్చి పోయే అలవాటు చరణ్ కి ఎప్పటినుంచో ఉందంటూ కామెడీ చేశారు. అంతేకాకుండా రాజమౌళి ని తిట్టే హక్కు రాజమౌళి భార్య రామ కి ఉన్నట్టే కీరవాణి ను తిట్టే హక్కు శ్రీవల్లి కి ఉందని, ఇంతకుముందు వరకు వాళ్ళ అమ్మ తనను తిట్టే వాళ్ళు కానీ పెళ్లయిన తర్వాత భార్య ముందు తిట్టడం ఇష్టం లేక ఆపేసారు అని అన్నారు ఎన్టీఆర్.

admin1

admin1

Next Story