అన్నయ్య కి సపోర్ట్ చెయ్యడానికి ముందుకు వచ్చిన ఎన్టీఆర్

* కళ్యాణ్ రామ్ సినిమా కోసం ఎన్టీఆర్ ఎం చేయబోతున్నారంటే..

Dhatripriya
Published on: 4 Feb 2023 1:39 PM IST
NTR Came Forward To Support His Elder Brother
X

అన్నయ్య కి సపోర్ట్ చెయ్యడానికి ముందుకు వచ్చిన ఎన్టీఆర్

Amigos: నందమూరి కళ్యాణ్ రామ్ ఈ మధ్యనే "బింబిసార" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. వెరైటీ కాన్సెప్టులకు పెద్దపీట వేస్తూ కరియర్లో ముందుకు దూసుకుపోతున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరొక ఆసక్తికరమైన ప్రాజెక్టుతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "అమిగోస్" సినిమా త్వరలో విడుదల కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దర్శకనిర్మాతలు సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నట్లు తెలుస్తోంది. చిత్ర బృందం కూడా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ 3 విభిన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సిద్దార్ధ్ అనే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా, మంజునాథ్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా మరియు మైఖెల్ అనే పాత్రలలో కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఫిబ్ర‌వరి 5న హైదరాబాద్ JRC కన్వెన్షన్ లో "అమిగోస్" ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌లో చిత్ర బృందం తో పాటు ఎన్టీఆర్ సందడి చేయబోతున్నారు. గతంలో క‌ళ్యాణ్ రామ్ "ప‌టాస్" సినిమా ప్రీ రిలీజ్‌కు కూడా ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని అంటుంటారు. వాళ్లలో ముగ్గురు కలుసుకుంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

Dhatripriya

Dhatripriya

Next Story