కనీసం ఐదు కోట్లు కూడా వసూలు చేయలేక పోయినా 'ఎన్టీఆర్ మహానాయకుడు?

కనీసం ఐదు కోట్లు కూడా వసూలు చేయలేక పోయినా ఎన్టీఆర్ మహానాయకుడు?
x
Highlights

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ లో మొట్టమొదటి భాగంగా తెరకెక్కిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయిన సంగతి తెలిసిందే. ఆ...

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ లో మొట్టమొదటి భాగంగా తెరకెక్కిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రభావం ఈ సినిమా రెండవ భాగమైన 'ఎన్టీఆర్ మహానాయకుడు' పైన బాగానే పడింది. మొదటి నుండి 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాపై అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయి. అనుకున్న విధంగానే ఈ సినిమా కూడా ఏ మాత్రం బజ్ లేకుండా ఫిబ్రవరి 22 వ తారీకు న విడుదలై మరొక డిజాస్టర్ గా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ షేర్లను నమోదు చేసుకున్న చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోవడం తో నందమూరి బాలకృష్ణ బాగా హర్ట్ అయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా కేవలం 4.7 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా ఫ్లాప్ అవడంతో చాలా వరకు ప్రేక్షకులు 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా థియేటర్లలో చూడడానికి ఇష్టపడలేదు. కనీసం బాలకృష్ణ కూడా ఈ సినిమా గురించి పెద్దగా హడావిడి ఏమీ చేయకుండా విడుదల చేశారు. ఇక ప్రస్తుతం ఎన్నికల పనిలో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఈ చిత్ర షూటింగ్ మే నుంచి మొదలు కానుంది. ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ నుంచి ఇంకా కోలుకోని బాలయ్య కనీసం బోయపాటి సినిమాతో అయినా హిట్ అందుకుంటారని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories