ఎన్టీఆర్ తో ఐదవ సారి జత కడుతున్న స్టార్ బ్యూటీ

NTR and Samantha: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.

Arun Chilukuri
Updated on: 29 Jun 2022 4:02 PM IST
NTR and Samantha to Team up Again
X

ఎన్టీఆర్ తో ఐదవ సారి జత కడుతున్న స్టార్ బ్యూటీ

NTR and Samantha: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఎప్పుడో గతేడాది డిసెంబర్ లో పట్టాలెక్కల్సిన ఈ సినిమా ఇంకా మొదలవలేదు. ఎన్టీఆర్ కెరీర్ లో ఈ మధ్య కాలంలో ఇంత లాంగ్ బ్రేక్ ఎప్పుడూ రాలేదు. అయితే ఈ మధ్యనే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన మోషన్ పోస్టర్ కి మంచి ఆదరణ లభించింది.

కానీ సినిమా షూటింగ్ విషయంలో అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు. కొందరేమో స్క్రిప్ట్ ఇంకా ఒక కొలిక్కి రాకపోవడమే సినిమా షూటింగ్ మొదలుకాకపోవడానికి కారణం అని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం సినిమాలో ఇంకా హీరోయిన్ సెట్ అవ్వలేదని అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుంది అని అంటున్నారు.

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సినిమా నుండి తప్పుకున్న తర్వాత "పెళ్లి సందడి" ఫేమ్ శ్రీ లీల, కృతి శెట్టి వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి కానీ ఎన్టీఆర్ కోసం స్టార్ హీరోయిన్ నే తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావించారట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకోసం సమంత ను సంప్రదించారట. ఒకవేళ సమంత కూడా సినిమా చేయడానికి ఒప్పుకుంటే, బృందావనం, రభస, రామయ్య వస్తావయ్యా, జనతా గారేజ్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబో లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఐదవ సినిమా అవుతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story