హ్యాపీ బర్త్ డే డియర్ జెన్నిఫర్.. భీమ్ స్పెషల్ విషెస్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న మూవీ ఆర్ఆర్ఆర్ ('రౌద్రం రణం రుధిరం') .

Samba Siva Rao
Published on: 29 Jan 2021 3:00 PM IST
హ్యాపీ బర్త్ డే డియర్ జెన్నిఫర్.. భీమ్ స్పెషల్ విషెస్
X

NTR Olivia 

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న మూవీ ఆర్ఆర్ఆర్ ('రౌద్రం రణం రుధిరం') . చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే 90శాతం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు.

బడా నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (జనవరి 29) ఒలీవియా బర్త్ డే సందర్భంగా ఆమె క్యూట్ లుక్ షేర్ చేస్తూ స్వీట్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్. హ్యాపీ బర్త్ డే డియర్ 'జెన్నిఫర్' అంటూ ఆర్ఆర్ఆర్ మూవీలో ఒలీవియా మోరిస్ పాత్ర పేరును పరిచయం చేశారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ సభ్యులు అందరూ ఒలీవియాకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుస ఈ మేరకు ఎన్టీఆర్ షేర్ చేసిన ఒలీవియా క్యూట్ లుక్ నెటిజన్లను ఫిదా అవుతున్నారు. సిల్వర్ స్రీన్ పై ఒలీవియా- ఎన్టీఆర్ జోడీని చూడాలని కుతూహలంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ ప్రేయసి (ఒలీవియా) పేరు జెన్నిఫర్ అని తెలపడం ఆర్ఆర్ఆర్ మూవీ అభిమనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ఖరారు చేశారు. అక్టోబర్ 13న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. నిజానికి ఈ ఏడాది జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా మూవీ చిత్రీకరణ ఆగిపోయిన సంగతి తెలిసిందే.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story