RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Samba Siva Rao
Published on: 30 April 2021 6:43 PM IST
RRR Movie News
X

RRR

RRR Movie: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్). స్వాతంత్ర్య సమరవీరులు అల్లురి సీతారామరాజు(రామ్ చరణ‌్), కొమరం భీం( ఎన్టీఆర్) పాత్రల్లో ఇద్దరు హీరోలు నటిస్తుండటంతో ఆర్‌ఆర్‌ఆర్‌ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. విడుదలకు ముందే ఈ సినిమాపై అంచనాలు ఫీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమాలో అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ,టీజర్స్ విడుదల అయ్యాయి. దీంతో సినిమాపై అంచానాలు భారీగా పెరిగాయి. సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. దీంతో ఈ సినిమా వాయిదా పడడం ఇది మూడో సారి. గతంతో 2021 జనవరిలో విడుదల చేస్తామని ప్రటించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా గత ఏడాది అన్నిసినిమాలు వాయిదా పడ్డాయి. షూటీంగులు నిలిచిపోయాయి. దాంతో ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడింది. అయితే ఈ ఏడాది షూటింగ్ ప్రారంభంచిన తర్వాత ఈ చిత్రం అక్టోబర్ 13 న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. కోవిడ్‌ సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో అన్ని సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ పడింది. దీంతో అనుకున్న సమయానికి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రీకరణ కూడా నిలిచిపోయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి గానీ, వేసవిలో గానీ విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఆర్ఆర్ఆర్ వాయిదాపై వార్తలు వస్తున్నాయి. ఇంకా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా చిరంజీవి ఆచార్య, నాగచైతన్య లవ్ స్టోరీ, రానా విరాటపర్వం, వెంకటేష్ నారప్ప వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే మిగతా చిత్రాలు విడుదలకు నోచుకుంటాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కొన్ని సినిమాలు ఓటిటి బాటపడుతున్నాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story