కొరటాల శివ కి సలహా ఇచ్చిన ఎన్టీఆర్

#ఎన్టీఆర్30 ఈ విషయంలో కొరటాల శివ కి సలహా ఇచ్చిన ఎన్టీఆర్

Rama Rao
Updated on: 2 May 2022 2:30 PM IST
NTR Advised Koratala Shiva For NTR30 Movie | Telugu Movie News
X

కొరటాల శివ కి సలహా ఇచ్చిన ఎన్టీఆర్

NTR-Koratala Siva: వరుసగా బ్లాక్బస్టర్ సినిమాలతో కెరీర్ లో ముందుకు దూసుకు వెళ్తున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కెరీర్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ నటించిన "ఆచార్య" సినిమాతో బ్రేక్ లు పడ్డాయి. నాలుగు సూపర్ హిట్ సినిమాలను అందించిన కొరటాల శివ "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా #ఎన్టీఆర్30న పెట్టుకున్నారు కొరటాల.

ఎలాగైనా ఈ సినిమాతో ఒక మంచి సూపర్ హిట్ ని అందుకొని మళ్ళీ తన సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు కొరటాల శివ. ఈ నేపథ్యంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కి కొన్ని సలహాలు ఇచ్చారని తెలుస్తోంది. గత సినిమాల ఫలితాల గురించి ఆలోచించకుండా తమ సినిమా కథ మీద మాత్రమే ఫోకస్ చేసి, కావాలంటే ఇంకొంచెం టైం తీసుకుని కథ మీద వర్క్ చేయమని ఎన్టీఆర్ కొరటాలకి చెప్పినట్లు తెలుస్తోంది.

మరో వైపు కొరటాల శివ ట్విట్టర్లో కూడా అకౌంట్ ఉన్నా ఆక్టివ్ గా ఉండే వాళ్ళు కాదు. ఈ నేపథ్యంలోనే కొరటాల ని ట్విట్టర్ లోకి మళ్ళీ రమ్మని ఎన్టీఆర్ చెప్పారట. సినిమా అప్ డేట్స్ ఇవ్వడానికి, ఫాన్స్ తో టచ్ లో ఉండటానికి, సినిమాపై వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి, ట్విటర్ మంచి వేదిక ఉపయోగపడుతుందని, ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్లు ఇవ్వకపోతే అభిమానులు కూడా అసంతృప్తికి లోనవుతారు అని అందుకే ట్విట్టర్ గా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండమని ఎన్టీఆర్ కొరటాల ని కోరారట.

Rama Rao

Rama Rao

Next Story