NTR30: ఎన్టీఆర్ సినిమా కోసం బండ్ల గణేష్ టైటిల్ తీసుకున్న కొరటాల..

NTR 30 Movie Titled As Devara?
x

NTR30: #ఎన్టీఆర్30 కోసం బండ్ల గణేష్ టైటిల్ తీసుకున్న కొరటాల..

Highlights

ఎన్టీఆర్ సినిమా కోసం బండ్ల గణేష్ టైటిల్ తీసుకున్న కొరటాల

NTR30: ఒక్క ఫ్లాప్ సినిమా కూడా రాని ప్రముఖ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "ఆచార్య సినిమాతో పెద్ద డిజాస్టర్ నే అందుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నారు.

"ఆర్ఆర్ఆర్" సినిమాతో ప్యాన్ ఇండియన్ ఇమేజ్ అందుకున్న ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో గతంలో "జనతా గ్యారేజ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకి రాబోతున్న రెండవ సినిమా ఇది. ఇక ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర టైటిల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

గతంలో నటుడు మరియు నిర్మాత అయిన బండ్ల గణేష్ "దేవర" అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో నమోదు చేశారు. కానీ ఇప్పటికే చాలా కాలం గడిచింది కానీ ఆ టైటిల్ ను రెన్యువల్ చేయడం మర్చిపోయారు. దీంతో ఎన్టీఆర్30 సినిమా కోసం ఈ టైటిల్ ను తీసేసుకున్నారు కొరటాల శివ. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. గతంలో అలియా భట్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారు కానీ ఆమె సినిమా నుంచి తప్పుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ మరియు మరిన్ని వివరాల గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories