Bigg Boss 5: వైల్డ్ కార్డ్ లేదు అంటున్న బిగ్ బాస్

Bigg Boss 5: ఈసారి వైల్డ్ కార్డ్ వాడని బిగ్ బాస్

admin1
Updated on: 18 Nov 2021 6:30 PM IST
No Wild Card Entry in Bigg Boss Season 5
X

వైల్డ్ కార్డ్ లేదు అంటున్న బిగ్ బాస్ (ఫైల్ ఇమేజ్) 

Bigg Boss 5: మిగతా అన్ని సీజన్లతో పోల్చుకుంటే ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 రేటింగ్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేదు అని చెప్పాలి. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ సెప్టెంబర్ లో 19 మంది కంటెస్టెంట్ ల తో మొదలైన ఈ షో ఇప్పుడు మరి కొన్ని వారాల్లో పూర్తి కాబోతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదిమంది కంటెస్టెంట్ లు మాత్రమే ఉన్నారు. అయితే ఇప్పటిదాకా జరిగిన ప్రతి సీజన్లోనూ బిగ్ బాస్ కనీసం ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా ఇచ్చారు.

కొన్ని సందర్భాల్లో అయితే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ లకు మరొకసారి వోటింగ్ పెట్టి మళ్లీ తిరిగి తీసుకొని వచ్చారు. కానీ ఇవేమీ బిగ్ బాస్ సీజన్ 5 లో జరగలేదు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న కంటెస్టెంట్ లు కూడా ప్రేక్షకులను ఆకర్షించ లేకపోతున్నారు. మరోవైపు బిగ్ బాస్ కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ పేరుతో ఏ సెలబ్రిటీ ఇంట్లోకి తీసుకు రావడం లేదు. ఇక వచ్చే నెల మధ్యలో ఈ షో సీజన్ 5 కి శుభం కార్డు పడబోతుంది. ఇక ఈ సీజన్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇంట్లో ఉన్న తొమ్మిది మంది కంటెస్టెంట్ లో ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఈ ఎనిమిది మందిలో ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుండి ఎవరు బయటకు వెళ్తారో ఇంకా వేచి చూడాల్సి ఉంది.

admin1

admin1

Next Story