Adipurush : ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవి : ఆదిపురుష్ టీమ్

Adipurush : ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవి : ఆదిపురుష్ టీమ్
x

Urvashi Rautela, Adipurush Movie

Highlights

Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మెయిన్ లీడ్ లో 'ఆదిపురుష్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని బాలీవుడ్

Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మెయిన్ లీడ్ లో 'ఆదిపురుష్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వం వహిస్తుండగా, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఆఫీషియల్ గా వచ్చిన ప్రకటనతో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.. ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరక్కుతుంది. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.

అయితే ఈ సినిమాలో సీత పాత్ర ఎవరు చేయనున్నారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మొదట్లో ఆ పాత్రను కీర్తి సురేష్ పోషిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.. ఆ తర్వాత కీయరా అద్వానీ చేయనున్నట్లుగా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఓ ప్రధాన పాత్ర కోసం ఇటీవల మరో నటి ఊర్వశి రౌతేలాను మేకర్స్ సంప్రదించిన్నట్లు వార్తలు వినిపించాయి.. అయితే ఈ వందుతుల పైన చిత్రబృందం స్పందించింది.. " ఆదిపురుష్‌లో ప్రధాన పాత్ర పోషించడానికి ఊర్వశి రౌతేలాను సంప్రదించినట్లు వస్తున్న కథనాలు, నివేదికలు పూర్తిగా నిరాధారమైనవి. అవాస్తవాలు " అని స్పష్టం చేసింది.

ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమా తరవాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నాడు ప్రభాస్.. ఈ సినిమాని వైజయంతి మూవీ సంస్థ నిర్మిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories