వాయిదా పడనున్న సీత

వాయిదా పడనున్న సీత
x
Highlights

వరుసగా డిజాస్టర్లను అందుకుంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మధ్యనే 'కవచం' సినిమాతో మరొక డిజాస్టర్ ను నమోదు చేసుకున్నాడు. అయితే మళ్ళీ 'కవచం' లో...

వరుసగా డిజాస్టర్లను అందుకుంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మధ్యనే 'కవచం' సినిమాతో మరొక డిజాస్టర్ ను నమోదు చేసుకున్నాడు. అయితే మళ్ళీ 'కవచం' లో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ తో మరొకసారి స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడానికి సిద్ధమైన బెల్లంకొండ హీరో 'సీత' అనే సినిమాలో నటించాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల అవుతుంది అని ప్రకటించారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది కానీ నిర్మాణానంతర పనులు ఇంకా చాలా బాకీ ఉన్నాయి. అవన్నీ పూర్తవడానికి ఎంతకాదన్నా నెల పడుతుందట.

అయితే ఈ నేపథ్యంలో విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అనుకున్న సమయం లోపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయలేక పోవడంతో దర్శకుడు తేజ సినిమాను పోస్ట్ ఫోన్ చేద్దామని అనుకుంటున్నాడట. వాయిదా వేయడం వల్ల 'సీత' సినిమా ప్రమోషన్స్ కి కూడా బాగానే టైం మిగులుతుంది. అసలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మార్కెట్ తక్కువగా ఉంది పైగా ఇప్పటిదాకా 2 పోస్టర్లు తప్ప సీత కు సంబంధించిన ఏది బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో సినిమా విడుదల చేసే కంటే వాయిదా వేయడమే మంచి ఆలోచన అని చిత్రబృందం విశ్వసిస్తోంది. మరి 'సీత' కొన్ని రోజులు ఆగి వస్తుందా లేక అనుకున్న తేదీకే థియేటర్లలోకి ప్రవేశిస్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories