Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు

Karan Johar: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ మధ్యనే తన 50వ పుట్టిన రోజు నీ జరుపుకున్నారు.

Arun Chilukuri
Updated on: 26 May 2022 9:30 PM IST
No Tollywood Celebrities in Karan Johar Birthday Party
X

Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు

Karan Johar: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ మధ్యనే తన 50వ పుట్టిన రోజు నీ జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో పలు బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాక టాలీవుడ్ నుంచి కూడా చాలామంది సెలబ్రిటీలు కరణ్ జోహార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా కరణ్ జోహార్ ఒక పెద్ద పార్టీ ని కూడా ఏర్పాటు చేశారు. సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా కనీసం ఒకరిద్దరు సెలబ్రెటీలు నైనా కరణ్ జోహార్ తన పుట్టిన రోజు పిలుస్తారు అని అందరూ అనుకున్నారు కానీ ఈ పార్టీలో ఒక్క టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కనిపించకపోవటం అందరినీ షాక్ కి గురి చేసింది.

అయితే లైగర్ సినిమా నుంచి చిత్ర డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ వంటి స్టార్లు మాత్రమే ఈ పార్టీలో కనిపించారు. తమన్నా కూడా ఈ పార్టీలో కనిపించింది. కానీ రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి వంటి స్టార్లు మాత్రం ఈ పార్టీకి హాజరు కాకపోవటం ఏంటని అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో కరణ్ జోహార్ వారిని పిలవలేదని చెబుతున్నారు. "లైగర్" సినిమా బృందాన్ని తప్ప మరింకే టాలీవుడ్ సెలబ్రిటీ నీ కరణ్ జోహార్ పిలవలేదని సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story