సమంత చేసిన త్యాగం వృధా అయిందా..? ఆశలు అడియాశలు అయ్యాయా..?

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈ మధ్యనే అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే...

Shireesha
Updated on: 27 April 2022 3:56 PM IST
No Promotions for Samantha Gunasekhar Shakuntalam Movie | Tollywood Gossips
X

సమంతా చేసిన త్యాగం వృధా అయిందా..? ఆశలు అడియాశలు అయ్యాయా..?

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈ మధ్యనే అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ కోసం సమంత చై తో విడిపోయినట్టు వార్తలు కూడా వినిపించాయి. ఇక విడాకుల తర్వాత కేవలం సినిమాల పైనే ఎక్కువగా దృష్టి పెట్టింది సామ్. వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్న సమంత ఈ మధ్యనే "పుష్ప" సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.

మరో వైపు సమంత హీరోయిన్ గా "శాకుంతలం" అనే సినిమా గుణశేఖర్ డైరెక్షన్లో త్వరలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు కానీ అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాకపోవటం చిత్ర బృందాన్ని నిరాశపరిచింది. నిజానికి "శాకుంతలం" సినిమా కి పెద్దగా ప్రమోషన్స్ లేవు. ఆఖరికి సమంత ఈ సినిమా చేస్తున్న సంగతి కూడా కొంత మందికి తెలీదు.

చూస్తూ ఉంటే సమంత తన కరియర్ కోసం పడిన కష్టం మరియు చేసిన త్యాగాలు అన్ని బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయని అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు. సినిమాల పై దృష్టి పెట్టిన సమంత ఈ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. కానీ ఈ సినిమా గురించి ఎటువంటి బజ్ లేకపోవటం, ఆఖరికి చిత్ర దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమా విషయంలో మౌనం వహించటం, పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టక పోవటం అభిమానులు దిగులు పడేలా చేస్తున్నాయి.

Shireesha

Shireesha

Next Story