Telangana: మాస్క్ లేదా నో ఎంట్రీ..నో మూవీ

No Entry Boards In Theaters
x

‍నో ఎంట్రీ బోర్డ్స్ థియేటర్స్

Highlights

Telangana: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్‌వేవ్ కల్లోలం సృష్టిస్తుంది.

Telangana: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్‌వేవ్ కల్లోలం సృష్టిస్తుంది. అక్కడా? ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు ఈ మహమ్మరి పాకిపోయింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూసివేశారు. మరికొన్ని రాష్ట్రాల్లో 30శాతం సీట్లకే పర్మిషన్స్ ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. థియేటర్ల యాజమాన్యాలే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కరోనా కట్టడి చేయాలంటే మాస్కులు తప్పనిసరిగా వాడాల్సిందేనని ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై ఫైన్లు కూడా వేస్తున్నారు. ఈ క్రమంలో మాస్కులు లేకపోతే సినిమా థియేటర్లలోకి కూడా అనుమతించడం లేదు. ఈ మేరకు మాస్క్ లేకపోతే థియేటర్ లోపలికి ప్రవేశం లేదంటూ బోర్డులు కూడా పెడుతున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో థియేటర్లో మాస్కులు లేకుండా ప్రవేశం లేదు. దీంతో సినీ అభిమానులు మాస్క్ ధరించి థియేటర్స్ వెళ్తున్నారు.

తెలంగాణలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 83వేల, 89 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 4వేల 9మందికి పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3లక్షల, 55వేల, 433కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో 14 మంది మరణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories