Teja: తేజ తదుపరి సినిమాపై స్పష్టత లేదు

Teja: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'సీత' సినిమా 2019 లో రిలీజ్ అయింది.

Venkata Chari
Updated on: 11 May 2021 10:30 PM IST
No clarity on Tejas next
X

డెరెక్టర్ తేజ (ఫొటో ట్విట్టర్)

Teja: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'సీత' సినిమా 2019 లో రిలీజ్ అయింది. ఈ సినిమాను క్రియోటివ్ డైరెక్టర్ తేజ డైరెక్షన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత ఇప్పటి వరకు మరో సినిమాను రిలీజ్ చేయలేదు.

అయితే తాజాగా తన సూపర్ హిట్ మూవీ 'చిత్రం' సినిమాకి సీక్వెల్ ను ప్రకటించాడు. ఈ చిత్రంలో 50 మంది కొత్త వాళ్లను తీసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అయితే, కరోనావైరస్ మహమ్మారితో ఈ చిత్రానికి సంబంధించిన అన్ని ప్రణాళికలను పక్కన పడేసేలా చేసింది.

మరోవైపు, తేజ తన కొడుకును హీరోగా ప్రారంభించాలనుకున్నాడు. ఈ సినిమాకు ఓ నిర్మాత కూడా దొరికాడని టాక్ వినిపించింది. కానీ, ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అలాగే సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ దగ్గుబాటిని హీరోగా లాంచ్ చేయనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. దీనిపై కూడా ఇంతవరకు క్లారిటీ లేదు.

అలాగే, రానా, గోపిచంద్ లతో సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడని టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీంతో తేజ తదుపరి చిత్రం ఏమిటనేది పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

Venkata Chari

Venkata Chari

Next Story