Rana Daggubati: రానా సినిమా అసలు విడుదల అవుతుందా

Rana Daggubati: రానా సినిమా అసలు విడుదల అవుతుందా
x
Highlights

Rana Daggubati: ఇంకా మోక్షం దొరకని రానా విరాటపర్వం సినిమా

Rana Daggubati: రానా దగ్గుబాటి హీరోగా నటించిన విరాటపర్వం సినిమా సెట్స్ పైకి వెళ్లి ఇప్పటికి మూడేళ్లు గడిచింది. కానీ ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ సినిమా మాత్రం ఇంకా విడుదల అవ్వలేదు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపించనున్నారు. ప్రియమణి, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా విడుదల విషయంలో ఇంతకుముందు థియేటర్లలో విడుదల చేయాలా లేక ఓటీటీ నా అని దర్శక నిర్మాతలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ ఇప్పుడు థియేటర్లన్నీ ఓపెన్ అయిపోయాయి. ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలి. ఒకవేళ ఓటీటీ లో విడుదల చేస్తే అభిమానులు కచ్చితంగా విమర్శల వర్షం కురిపిస్తారు.

కానీ ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయడానికి ముందు రానా "భీమ్లా నాయక్" సినిమా రిజల్ట్ ని చూడాలి అని అనుకుంటున్నారట. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఒకవేళ సంక్రాంతి బరిలో నుండి తప్పుకుంటే ఈ సినిమా మార్చి లేదా ఏప్రిల్లో తెరకెక్కనుంది. అప్పటిదాకా ఆగి ఆ సినిమా రిజల్ట్ ని చూసిన తరువాత విరాటపర్వం విడుదల చేయాలంటే అప్పటికే చాలా సమయం పడుతుంది. ఇప్పటికే చాలా మంది ఈ సినిమా ఉంది అన్న విషయాన్ని మర్చిపోయారు. టీజర్, మొదటి పాట కూడా విడుదల అయి చాలా కాలం గడిచిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్ డేట్ కూడా ఈ మధ్యకాలంలో కనిపించలేదు. మరి ఈ సమయంలో సినిమా ను థియేటర్ లలో విడుదల చేస్తారా లేక ఓటీటీ విడుదల చేస్తారా అనేది ఇంకా సందేహమే.

Show Full Article
Print Article
Next Story
More Stories