Ajith Kumar: అజిత్ సినిమాకి బయర్లే లేరా?

Ajith Kumar: మిగతా భాషల్లో అజిత్ సినిమాకి బయర్ల టెన్షన్

Rama Rao
Published on: 3 Nov 2022 12:46 PM IST
No Buyers for Ajith Kumars Thunivu Film | Kollywood News
X

Ajith Kumar: అజిత్ సినిమాకి బయర్లే లేరా? 

Ajith Kumar: సంక్రాంతి వచ్చిందంటే పెద్ద సినిమాల మధ్య కూడా భారీ కాంపిటేషన్ ఏర్పడుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సినిమాలు విడుదలకు లైన్ లో వేచి ఉన్నాయి. కానీ వాటి విడుదల తేదీలు మాత్రం ఇంకా ఖరారు కావాల్సి ఉన్నాయి. అందులో ఒకటి అజిత్ హీరోగా నటిస్తున్న "తునివు" కాగా మరొకటి విజయ్ హీరోగా నటిస్తున్న "వారిసు" (తెలుగులో వారసుడు). అయితే విజయ్ సినిమాని పక్కన పెడితే అజిత్ సినిమాని తమిళ్లో తప్ప వేరేచోట బయ్యర్లు కొనేందుకు ఆసక్తి చూపించడం లేదట.

రెడ్ జయంట్ మూవీస్ వారు ఈ సినిమా తమిళనాడు రైట్స్ ను సొంతం చేసుకున్నారు. కానీ మిగతా భాషల్లో మాత్రం సినిమా కోసం బయర్లు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగులో విడుదల అవుతుందో లేదో అని ఇంకా తెలియాల్సి ఉంది. ఇక అజిత్ కి తెలుగులో కూడా అంత మార్కెట్ లేదు. కేరళలో కూడా అజిత్ క్రేజ్ అంతంత మాత్రమే అని చెప్పాలి. కర్ణాటక వంటి ప్రాంతాల్లో సినిమా అమ్ముడైనప్పటికీ చాలా తక్కువ రేట్లకే బయర్లు కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలో విజయ్ నటిస్తున్న "వారిసు" సినిమా అజిత్ సినిమా తో పోలిస్తే డబల్ బిజినెస్ చేస్తుంది. మజ్ను వారియర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 2014లో సంక్రాంతి సందర్భంగా అజిత్ "వీరం" మరియు విజయ్ "జిల్లా" సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అయ్యాయి. మళ్లీ 8 ఏళ్ల తర్వాత వీరిద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అవ్వనున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story