సూపర్ స్టార్ కూతురు గా మారనున్న హీరోయిన్

Ruthvik
Published on: 8 April 2019 11:45 AM IST
సూపర్ స్టార్ కూతురు గా మారనున్న హీరోయిన్
X

కొన్ని నెలలు సినిమాలకు దూరంగా ఉన్న నివేదాథామస్ ఈ మధ్యనే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కె.వి.గుహన్ దర్శకత్వంలో విడుదలైన '118' చిత్రంలో నటించింది. కానీ ఈ సినిమా అనుకున్నంత మంచి ఫలితాన్ని అందించలేకపోయింది. మలయాళంలో కూడా ఈమె సినిమాలు పెద్దగా హిట్ అవ్వడం లేదు. కానీ తాజా సమాచారం ప్రకారం నివేద థామస్ కి ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. ఈమెకు తమిళంలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం దక్కింది.

ఈ మధ్యనే 'పెట్ట' అనే సినిమాతో తమిళంలో పెద్ద హిట్ ను అందుకున్న రజనీకాంత్ తాజాగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రాన్ని ప్రస్తుతం #తలైవా166 అని పిలుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీకాంత్ కూతురిగా నివేద థామస్ నటించనుంది. ఈ వార్త తాలూకు అధికారిక ప్రకటన కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ 10 నుంచి మొదలవుతుంది.

Ruthvik

Ruthvik

Next Story