నివేదా థామస్ కల నెరవేరుతుందా

Ruthvik
Published on: 8 March 2019 4:08 PM IST
నివేదా థామస్ కల నెరవేరుతుందా
X

చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ నివేదా థామస్ నాని 'జెంటిల్ మన్' సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తరువాత 'నిన్ను కోరి', 'జైలవకుశ' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేద చదువు కోసం కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ కళ్యాణ్ రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన '118' చిత్రంతో మన ముందు వచ్చింది. ఆ చిత్రంలో తన నటనకు మంచి మార్కులే వేయించుకుంది. ప్రస్తుతం అరడజను వరకు సినిమాలతో బిజీగా ఉన్న నివేదా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం తనకు తెలుగు తమిళ బాషాలనుండి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి కానీ కథను, పాత్రను చూసి మాత్రమే సినిమాల ఎంపిక చేస్తున్నానని, తనకు టాలీవుడ్, కోలీవుడ్ లో ఏ హీరోయిన్ పోటీ కాదని చెప్పిన నివేద తనకు హీరోలే పోటీ అని అంటోంది. హీరోలతో పోటీ పడి నటించాలని ఉంటుంది కానీ హీరోయిన్ లతో పోటీ పడాలని ఉండదని చెప్పుకొచ్చింది. ఎప్పటికైనా హీరో స్థాయి హీరోయిన్ అంటూ తనను గుర్తించాలి హీరోలతో తనను పోల్చే స్థాయికి వెళ్లాలి అని ఆశపడుతున్నట్లు చెప్పింది. అది అంత సులువైన విషయమైతే కాదు కాని నివేద కల తీరేనా లేదా చూద్దాం.

Ruthvik

Ruthvik

Next Story