స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న నిత్య మీనన్..?

Nithya Menon To Marry A Malayalam Star Hero
x

స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న నిత్య మీనన్ 

Highlights

Nithya Menon Marriage: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్ లలో నిత్యమీనన్ కూడా ఒకరు.

Nithya Menon Marriage: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్ లలో నిత్యమీనన్ కూడా ఒకరు. అయితే గత కొంతకాలంగా ఈమె ఇండస్ట్రీలో సినిమాలు చేయడం బాగా తగ్గించేస్తుంది. అయితే తాజాగా దీనికి కారణం ఈమె పెళ్లి చేసుకోబోతోంది అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిత్య మీనన్ తన జీవితంలో అతిపెద్ద నిర్ణయం తీసుకుందని, అది తన పెళ్లి గురించేనని త్వరలోనే ఒక మలయాళం స్టార్ హీరోతో నిత్య పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. కానీ ఇరువర్గాల కుటుంబాలు వీరి వివాహానికి తమ అంగీకారం తెలిపారని తెలుస్తోంది. ఇప్పటికే నిత్యామీనన్ పెళ్లికి సంబంధించిన పనులు కూడా మొదలైపోయాయట. త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన విషయాలు నిత్యామీనన్ బయట పెట్టబోతోంది అని సమాచారం.

ఇక ఆఖరిసారిగా నిత్యామీనన్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "భీమ్లా నాయక్" సినిమాలో కనిపించింది. ఈ మధ్యనే "మోడర్న్ లవ్" అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది. మరోవైపు తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో కి జడ్జిగా కూడా వ్యవహరించిన నిత్యామీనన్ "ఆరంతిరుకల్పన" అనే సినిమా తప్ప మరే సినిమాని సైన్ చేయలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories