'ఆర్ ఆర్ ఆర్' హీరోయిన్ పై నిర్మాతల బ్యాన్

Ruthvik
Published on: 30 April 2019 3:05 PM IST
ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ పై నిర్మాతల బ్యాన్
X

మిగతా హీరోయిన్లతో పోలిస్తే నటనకు స్కోప్ ఉన్న పాత్రలను మాత్రమే ఏరికోరి ఎంపిక చేసుకొనే హీరోయిన్ లలో నిత్యా మీనన్ ఒకటి. అయితే తాజాగా ఈ భామ ఒక వివాదంలో చిక్కుకుంది. కొన్ని రోజులుగా నిత్యమీనన్ ప్రవర్తన మలయాళం నిర్మాతలకు చిరాకు తెప్పిస్తోందట. ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు ఆమెను కలవడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె ఎవరితోనూ మాట్లాడలేదు సరికదా కనీసం మర్యాద కూడా చేయలేదట. దాంతో కోపం తెచ్చుకున్న మలయాళం నిర్మాతలు ఆమెను మలయాళం ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి.

అయితే తాజాగా ఈ విషయమై రియాక్ట్ అయ్యింది నిత్యామీనన్. మీడియాతో మాట్లాడుతూ నిర్మాతలు తనను కలవడానికి వచ్చిన సమయంలో వాళ్ల అమ్మగారు మూడవ స్టేజి క్యాన్సర్ తో బాధ పడుతున్నారని, అసలు కనీసం నటించడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో వారిని కలిసి ఏడుస్తూ మాట్లాడాలా అని ఆమె వాపోయింది. తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని, అయినా తను ఇవన్నీ పట్టించుకోనని తన పని తాను చేసుకుని వెళ్లిపోతానని క్లారిటీ ఇచ్చింది నిత్యామీనన్. మరి మలయాళం నిర్మాతలు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక తాజాగా నిత్యమీనన్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Ruthvik

Ruthvik

Next Story