logo

స్టార్ కపుల్ పెళ్లి జరగడానికి కారణం నిత్య నే నట

స్టార్ కపుల్ పెళ్లి జరగడానికి కారణం నిత్య నే నట
Highlights

'గీత గోవిందం' సినిమాలో విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న జంటను కలపడానికి విజయ్ కి ప్లాన్ చెప్పిన నిత్యామీనన్...

'గీత గోవిందం' సినిమాలో విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న జంటను కలపడానికి విజయ్ కి ప్లాన్ చెప్పిన నిత్యామీనన్ ఇప్పుడు నిజజీవితంలో కూడా ఒక్క ప్రేమికుల జంట కలవడానికి కారణమైందట. మలయాళం సినిమా 'బెంగళూరు డేస్' లో ఫహాద్ ఫాజిల్, నజ్రీయా హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ లోనే ప్రేమించుకున్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకుని హాయి గా ఉంటున్నారు. అయితే నిజానికి నజ్రియా పోషించిన పాత్ర కోసం ముందుగా దర్శక నిర్మాతలు నిత్యామీనన్ ను అనుకున్నారట.

కానీ కాల్షీట్ల సమస్య వల్ల నిత్య హీరోయిన్ పాత్రను వదులుకోవాల్సి వచ్చిందట. అది కాస్త నిత్యా కి వరించిందట. ఇక షూటింగ్ టైంలో ఫేహాద్ తో నజ్రియా స్నేహం ప్రేమగా మారి వారి వివాహానికి సైతం దారితీసింది. ఒకవేళ ఈ సినిమాను నిత్యా ఒప్పుకుని ఉంటే నజ్రియా కి ఈ సినిమాలో అవకాశం కాదు దక్కేది కాదు, ఆమె ఫేహాద్ ని కూడా కలిసేది కూడా కాదు. అలా ఆమెకు తెలియకుండానే నజ్రియా, ఫహద్ జంట పెళ్లి చేసుకోవడానికి నిత్యా ఒక కారణంగా మారిందన్నమాట. ఇక సినిమాల పరంగా ఆఖరిసారిగా 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో సావిత్రి పాత్రలో కనిపించిన నిత్యామీనన్ చేతిలో ప్రస్తుతం కొన్ని తమిళ, మలయాళ సినిమాలు ఉన్నాయి.




లైవ్ టీవి


Share it
Top