Nithya Menen: పెళ్లి చేసుకుంటున్నావా..మా గుండె ముక్కలు చేయొద్దు!

Nithya Menen: పెళ్లి చేసుకుంటున్నావా..మా గుండె ముక్కలు చేయొద్దు!
x

నిత్యా మీనన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Nithya Menen: నిత్య తాజాగా పెళ్లి గెటప్‌లో దర్శనమిచ్చింది. తెల్లగా మెరిసిపోతున్న పెళ్లి గౌను ధరించి ఆమె ఫొటోలకు పోజిచ్చింది

Nithya Menen: నాని హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అలా మొదలైంది'. ఈ చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది బెంగుళూరు బ్యూటీ నిత్యా మీనన్. ఆ సినిమాలో బొద్దుగా ముద్దుగా కనిపించిన ఈ భామ యూత్ ఆడియన్స్ మనసు దోచింది. దీంతో నిత్యాకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా తర్వాత యువ కథానాయకులతో వరుస పెట్టి సినిమాలు చేసింది. విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తూ మరోసారి కుర్రకారుల గుండెల్ని కొల్లగొట్టింది. వైవిధ్య భరిత చిత్రాలతో ముందుకు వెళ్తున్న నిత్యాను చూసిన అభిమానులు గుండె జారి గల్లంతయ్యిందనే చెప్పాలి.

గంగ వంటి సినిమాలో నిత్యామీనన్ నటనకు తెలుగు, తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమాలో నిత్య వికలాంగురాలిగా కనిపించి ప్రేక్షకులు ఆశ్చర్యపరిచింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో నటించిన నిత్యా.. మధుర గాత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన నిత్య తాజాగా పెళ్లి గెటప్‌లో దర్శనమిచ్చింది. తెల్లగా మెరిసిపోతున్న పెళ్లి గౌను ధరించి ఆమె ఫొటోలకు పోజిచ్చింది. వేలికి ఉంగరం, మెడకు చోకర్‌తో సింప్లీ సూపర్బ్‌ అనిపించుకుంటున్న ఈ ఫొటోలు చూసి పెళ్లి పీటలెక్కుతుందేమోనని తప్పులో కాలేయకండి.

ఇది కేవలం ఫొటోషూట్‌ మాత్రమే నిత్యా డ్రస్ వేసింది. తెల్లటి దుస్తులతో చిరునవ్వులు చిందిస్తున్న నిత్య ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెడ్డింగ్‌ డ్రెస్‌లో నిత్యను చూసిన అభిమానులు మా దిష్టే తగిలేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. 'కొంపదీసి పెళ్లి చేసుకుంటున్నావా అంటూ ఇలాంటి షాకింగ్‌ వార్తలు చెప్పి మా గుండెను ముక్కలు చేయొద్దు' అని కొందరు ఫ్యాన్స్‌ వేడుకుంటున్నారు.

నిత్యామీనన్ గత ఏడాది 'బ్రీత్‌: ఇన్‌టూ ద షాడోస్'‌ వెబ్‌ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వరుస సినిమాతో బీజీగా ఉంది. తమిళ సిరీస్‌ 'నవరస'లో ఆమె కనిపించనుంది. మరోవైపు తెలుగులో 'గమనం'తో పాటు, మలయాళంలో 'కోలాంబి' , '19 1 A'అనే సినిమాలతో నిత్య ఫుల్ బిజీగా ఉంది.



Show Full Article
Print Article
Next Story
More Stories